Tuesday, September 24, 2019
Follow Us on :

అక్కడ కనుమరుగైపోయిన టీడీపీ

By BhaaratToday | Published On Mar 21st, 2019

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు నామా నాగేశ్వ‌ర‌రావు నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖ‌మ్మం ఎమ్మ‌ల్యే  పువ్వాడ అజ‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ నామా నాగేశ్వరరావుకు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఆయ‌న‌తో పాటు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు తుళ్లూరు  బ్రహ్మయ్య, పార్టీ జిల్లా సీనియ‌ర్ మ‌హిళా నాయ‌కురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి గులాబీ కండువా క‌ప్పుకున్నారు. వీరి చేరిక‌తో దాదాపు గా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాల్లో టీడీపీ పార్టీ క‌నుమ‌రుగ‌య్యిన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల స‌మాచారం.