Friday, December 13, 2019
Follow Us on :

ఆమె ఒక మోడల్.. ప్రియుడే ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు

By BhaaratToday | Published On Jul 15th, 2019

19 సంవత్సరాల మోడల్.. జీవితంలో ఎంతో సాధించాలని అనుకుంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఆమె జీవితంలో విలన్ గా మారుతాడని అసలు ఊహించలేదు. ఆమె క్యారెక్టర్ మీద అనుమానం పెంచుకున్న ప్రియుడు దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఎలాగంటే ఆమె తల మీద కారు వెళ్లేలా చేసి నుజ్జు నుజ్జు చేశాడు. ఇంతటి దారుణం మోడల్‌ ఖుషీ పరిహార్‌ జీవితంలో చోటుచేసుకుంది.  

ఖుషీ పరిహార్‌ నాగపూర్‌లో నివసిస్తోంది. ఆమె అష్రఫ్‌ షేక్‌ అనే వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉందని తెలుస్తోంది. శనివారం ఉదయం నాగ్ పూర్ పోలీసులకు పందూర్న-నాగపూర్‌ హైవేపై ఓ యువతీ శవం గుర్తు పట్టడానికి కూడా వీలు లేకుండా ఉండడం తెలిసింది. అయితే సోషల్ మీడియా హెల్ప్ తీసుకున్న పోలీసులు చనిపోయిన అమ్మాయి ఖుషీ పరిహార్‌ గా గుర్తించారు. దీంతో అసలు విషయాన్ని బయటకు లాగారు పోలీసులు.  

Image result for khushi parihar

స్థానికంగా పలు షోలకు మోడలింగ్ చేసేది ఖుషీ పరిహార్. ఎప్పటికైనా మోడలింగ్ లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కనేది. అబ్బాయిలతో చనువుగా ఉండడం ఆమె ప్రియుడు అష్రఫ్  అసలు నచ్చలేదు. అష్రఫ్‌ షేక్‌ ఆమెపై కొంతకాలంగా ఖుషీపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెతో గొడవలే ఎక్కువ..! జూలై 12న శుక్రవారం రోజున వారిద్దరూ కారులో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో మరోసారి గొడవ వచ్చింది. కోపంతో ఊగిపోయిన అష్రఫ్‌ షేక్‌ ఆమెను దారుణాతి దారుణంగా హత్య చేసి పందూర్న-నాగపూర్‌ హైవేపై పడేసి  వెళ్ళిపోయాడు. 

Image result for khushi parihar

ఆమె ఎవరూ అన్నది తెలుసుకున్న పోలీసులకు అష్రఫ్‌ షేక్‌ కనిపించకుండా పోవడం అనుమానాలకు దారితీసింది. దీంతో అతడిని పోలీసులు వెతికి పట్టుకున్నారు.  అతడు పోలీసుల ఎదుట నేరాన్ని కూడా అంగీకరించాడు.  

Related image