Tuesday, October 15, 2019
Follow Us on :

కియా కారు విడుదల..!

By BhaaratToday | Published On Jan 29th, 2019

అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ నుంచి తొలి కారు ఈ ఉదయం విడుదలైంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తొలి కారును స్వయంగా విడుదల చేశారు. ఈ ఉదయం విజయవాడ నుంచి పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు చంద్రబాబు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో కియా పరిశ్రమలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వరకూ వెళ్లారు. ప్రభుత్వ సహకారంతోనే తాము రెండున్నరేళ్ల వ్యవధిలో ప్లాంటు, అసెంబ్లీ లైన్ ను నిర్మించి తొలి కారును తయారు చేయగలిగామని సంస్థ చీఫ్ పార్క్ వ్యాఖ్యానించారు. మేడిన్ ఆంధ్రా కారుగా ఈ కారు నిలుస్తుందని తెలిపారు.

 

దేశంలోనే కరువు ప్రాంతంగా అనంతపురం జిల్లాకు పేరుంది. ఆ జిల్లా పేరు వింటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది కరవు సమస్యే. అందుకే అక్కడి ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్లి జీవనం సాగిస్తున్నారు.కియా కారణంగా ఇప్పుడు వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. నేడు కియా కారు ట్రయల్ రన్ నిర్వహించారు. కియా సంస్థతో ఆ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి.

 

అనంతపురం జిల్లా అనగానే కరువు ప్రాంతమని జనం జంకుతారు. అలాంటి కరువు నేలపైనే అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి తొలి కారు విడుదల అయింది. కియా కంపెనీ స్థాపనకు ఆ సంస్థ సుమారు 13వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ వాణిజ్య సంస్థతో  సుమారు 11వేల మందికి ఉపాధి దొరకనుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన మొదటి కారుతో.. ఈ నెల 29న ట్రయిల్ రన్ నిర్వహించనున్నారు. జిల్లాలో కరువు తాండవంతో పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్న ప్రజలకు కియా మోటార్స్ సంస్థతో ఉపాధి భరోసా కల్పించినట్లయింది. 

 

 

ఎర్రమంచిలి దగ్గరలోని కియాకార్ల పరిశ్రమలో.. తొలి ట్రయల్ కారును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ట్రయల్ రన్ ప్రోగ్రామ్ కు కొరియా రాయబారి షిన్ హాజరయ్యారు. పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో కియా అనుబంధ పరిశ్రమల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. 

 

దేశంలోనే అతిపెద్ద కియా కార్ల పరిశ్రమతో కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా చరిత్ర పూర్తిగా మారిపోనుంది. 13వేల 500 కోట్ల పెట్టుబడితో ఎర్రమంచిలి వద్ద పరిశ్రమను నిర్మించారు. దీనికి అనుబంధంగా 17 పరిశ్రమలు వచ్చాయి. వీటితో దాదాపు 20 వేలమందికి భవిష్యత్తులో ఉపాధి లభించనుంది. దీంతో జిల్లా చరిత్రలోనే కియా పరిశ్రమ మరుపురాని ఘట్టాల్లో నిలవనుంది.