Monday, December 09, 2019
Follow Us on :

తెలుగు అర్జున్ రెడ్డి.. హిందీ ప్రీతి.. తొలిసారి..!

By BhaaratToday | Published On Sep 9th, 2019

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా విజయ్ దేవరకొండ సంపాదించిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాను చూసి పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ అయిపోయారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, భరత్ అనే నేను హీరోయిన్ కియారా అద్వానీలు విజయ్ దేవరకొండతో కలిసి నటించాలనుందని పలు ఇంటర్ వ్యూలలో చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా రీమేక్ చేయగా.. అందులో ప్రీతి క్యారెక్టర్ ను కియారానే చేసింది. 

ఇప్పుడు తెలుగు అర్జున్ రెడ్డి, హిందీ ప్రీతి కలిసి నటించారు. అయితే విజయ్, కియారా కనువిందు చేయనుంది సినిమాలో కాదు. ఒక టీవీ యాడ్ లో..! వీరిద్దరూ ఓ టీవీ యాడ్ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఆ యాడ్ షూట్ లో కియారా ఎరుపు రంగు గాగ్రా చోళీలో తళుక్కుమనగా.. విజయ్ దేవరకొండ బ్లూ కలర్ ఇండో-వెస్ట్రన్ డ్రెస్ లో కనిపించాడు. షూట్ తర్వాత ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో పార్టీకి హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా అక్కడ కనిపించాడు.  

Pretty in pink

Image

Image

Image

Image

Handsome as ever

Image