Tuesday, May 21, 2019
Follow Us on :

భారత క్రికెటర్ షమీపై ఛార్జిషీట్

By BhaaratToday | Published On Mar 14th, 2019

భారత క్రికెటర్ మొహమ్మద్ షమీపై ఛార్జి షీట్ నమోదైంది. షమీ భార్య హసీన్ జహాన్ పెట్టిన ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు షమీపై ఛార్జిషీట్ నమోదు చేశారు. కోల్ కతా పోలీస్ డిపార్ట్ మెంట్ మహిళల గ్రీవెన్స్ సెల్ షమీపై సెక్షన్ ఐపీసీ 498ఏ, సెక్షన్ 354ఏ కింద చార్జిషీట్ నమోదు చేసింది. 498ఏ సెక్షన్ ఓ మహిళపై భర్త కానీ, ఇతర బంధువులు కానీ హింసకు పాల్పడినప్పుడు, 354ఏ సెక్షన్ ను ఓ మహిళ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు వాడుతారు. ఇంకా షమీపై  ఎఫ్ఐఆర్ నుంచి సెక్షన్ 307, సెక్షన్ 376 అభియోగాలను తొలగించారు. 

హసీన్ జహాన్ తన భర్త షమీపై చాలా రోజులుగా దారుణమైన అభియోగాలు మోపుతూ వస్తోంది. తన భర్తకు వివిధ మహిళలతో సంబంధాలు ఉన్నాయని.. తనను షమీ కుటుంబసభ్యులు విపరీతమైన టార్చర్ పెట్టారని ఆమె ఆరోపించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆమె గతంలో కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా షమీపై ఉన్న ఛార్జి షీట్ల కారణంగా అతడికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అతి త్వరలో షమీ ఐపీఎల్ ఆడబోతున్నాడు. ఇక వరల్డ్ కప్ జట్టులో కూడా షమీకి దాదాపు చోటు దక్కినట్లే.. ఇటువంటి తరుణంలో మరోసారి షమీ కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు.