Saturday, October 19, 2019
Follow Us on :

మీకు ఎవ‌రు చెప్పారు...అంతా అబ‌ద్దం..!

By BhaaratToday | Published On Feb 25th, 2019

హీరోయిన్‌ అంజలికి కోపం వచ్చింది. సాధారణంగా ఏ విషయానైనా ఈజీగా తీసుకునే ఈ బ్యూటీ... అపుడెప్పుడో పిన్నితో మనస్పర్థలు వచ్చినప్పుడు కూడా ఆవేదన చెందిందేగానీ అంతగా కోపం రాలేదు. అంజలి చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చింది గానీ, తమిళ చిత్రాలకూ దూరం కాలేదు. ఇప్పటికీ తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూనే ఉంది. రెండు భాషల్లోనూ నటిగా మంచి పేరును సంపాదించుకుంది. ఇకపోతే వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే ఆ మధ్య నటుడు జైతో ల‌వ్‌లో ప‌డ్డ‌ట్లు ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ వంటింటి వరకూ వెళ్లి దోసెలు వేసుకుని తింటూ మీడియాలోనూ వైర‌ల్ అయ్యారు. అలాంటిది ఆ తరువాత వీరిద్దరి మధ్య ఏమైందో గానీ, తమ మధ్య ప్రేమ లేదు, దోమ లేదు అంటూ బహిరంగంగానే చెప్పేశారు. నటుడు జై కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇదే విష‌యాన్ని చెప్పారు. ఇక తాజా విషయానికి వస్తే  అంజలి ఒక నటుడితో ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లికి సిద్ధం అవుతోందని సామాజిక మాధ్య‌మాల్లో ప్రచారం జరుగుతోంది. అంతే కాదు పెళ్లి తరువాత నటనకు టాటా చెప్పనుందనేది వైరల్‌ అవుతోంది. ఇక్కడే అంజలికి ఆగ్రహం కట్టలు తెంచుకుందని సమాచారం.

ఈ విష‌య‌మై అంజలి స్పందిస్తూ, వివాహమైన నటీమణులే తిరిగి నటించడానికి రెడీ అవుతుంటే తానెందుకు నటనకు గుడ్‌బై చెప్పాలి? అని ప్రశ్నించింది. అయినా తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎవరు చెప్పారు? అంతా అబ‌ద్దం..అంటూ కస్సుబుస్సు లాడింది. నిజానికి తనకిప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదని, ఒక వేళ వివాహం చేసుకున్నా, నటనకు దూరం కానని స్పష్టం చేసింది. అయితే తాను ప్రేమలో పడ్డ విషయం గురించి క్లారిటీ ఇవ్వలేదు.