Thursday, December 12, 2019
Follow Us on :

వారు పిల‌వ‌డం లేదు.. నేను వెళ్ల‌డం లేదు

By BhaaratToday | Published On Jul 18th, 2019

కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లరని.. వెళితే రాజగోపాల్ రెడ్డి మాత్రమేనని.. త్వరలోనే ఈ చేరిక ఉంటుందని కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఫైనల్‌గా ఈ చేరిక వ్యవహారంపై కోమటిరెడ్డి తేల్చేశారు. తనను బీజేపీ పిలవడం లేదని.. తాను కూడా కాషాయ కండువా కప్పుకోవట్లేదని క్లారిటీగా చెప్పేశారు.
 
నాయకత్వలోపం వల్లే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారని.. ఈ విష‌యం నాలుగు గోడల మధ్య చాలా సార్లు చెప్పానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత పీసీసీ అధ్య‌క్షుడు రాజీనామా చేస్తే బాగుండేదని.. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ బలంగా ఉన్నా నాయకత్వ లోపం వల్ల కార్యకర్తలు రోడ్డున పడ్డారని.. ఏఐసీసీ నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చింద‌ని.. దానికీ సమాధానం ఇచ్చానని. యూటర్న్ తీసుకోలేదని.. ప్రస్తుతం నేను కాంగ్రెస్ సభ్యుడిని అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.