Tuesday, October 15, 2019
Follow Us on :

కృష్ణా తివారి.. ఇతడు ఆడపిల్లలను మాత్రమే కిడ్నాప్ చేసి.. వదిలిపెడతాడు.. దీని వెనుక ఉన్న కథ..?

By BhaaratToday | Published On Jan 29th, 2019

కృష్ణా తివారి.. ఇతడి ఫోటోను చూస్తున్నారు కదా..! ఇతడు చేసే పని ఒకటే.. ఆడపిల్లలను కిడ్నాప్ చేయడం. రెండు రోజులు తన వద్దనే ఉంచుకోవడం.. ఆ తర్వాత ఆ ఆడపిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు పంపించడం. ఇంతకూ ఆ వ్యక్తి పిల్లలను తన వద్ద ఉంచుకొని చేసే పని ఏంటో తెలుసా..? ఇంటికి తీసుకెళ్లి, ఆమెకు కావాల్సిన వన్నీ కొనిచ్చి, మరుసటి రోజు జాగ్రత్తగా వాళ్ళను ఇంటికి చేర్చేవాడు. ఇది ఢిల్లీలో చోటుచేసుకుంది. పిల్లల కిడ్నాపర్ అయిన కృష్ణా తివారీకి సంబంధించిన విషయాలు బయటకు రావడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. 

కృష్ణా తివారి కిడ్నాప్ చేసే వాళ్లంతా 8 నుంచి 12 ఏళ్లలోపు వయసున్న వారే. పోలీసులు కేసును విచారించే లోపే మరుసటి రోజు తమ బిడ్డ ఇంటికి చేరిందని తల్లిదండ్రులు చెప్పేవారు. ఇలా చాలా కేసులు నమోదయ్యాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా ఆ పని చేస్తోంది కృష్ణా తివారి అని తేలింది. ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్స్ లో డ్రైవర్ గా విధులు నిర్వర్తించే కృష్ణా తివారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అమ్మాయిలంటే తివారీకి చాలా ఇష్టం. తనకు ఆడ పిల్లలు లేరన్న కారణంతో ఇలా ప్రతి ఆడపిల్లను ఇంటికి తీసుకెళ్లేవాడు. వాళ్ళకు కావాల్సినవన్నీ కొనిచ్చి, మరుసటి రోజు జాగ్రత్తగా ఇంటికి పంపేవాడు. కుమార్తెలు లేరన్న కారణంతోనే ఇలా బాలికలను తీసుకువచ్చేవాన్నని పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు తివారి. 

డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు మోనికా భరద్వాజ్ కూడా అతడు అమ్మాయిలను కిడ్నాప్ చేయడం వెనుక వేరే ఉద్దేశ్యం ఏమీ లేదని భావిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ అతడికి సైకాలజిస్టులతో ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పారు. రోడ్డు పక్కన, స్లమ్ లలో నివసించే పిల్లలను తీసుకొని వెళ్లి.. వారిని కొన్ని రోజుల పాటూ ఉంచుకొని.. కడుపు నిండా అన్ని తినిపించి.. బొమ్మలు కొనిపించేవాడట. చిన్న పిల్లలు కూడా అతడు తమకు ఎటువంటి 'చెడు' చేయలేదని చెప్పుకొచ్చారని మోనికా భరద్వాజ్ చెప్పారు. బజాజ్ డిస్కవర్ లో పిల్లలను తీసుకొని వెళ్ళేవాడు తివారి. ఓ 200 బైక్ ల మీద దృష్టి పెట్టగా.. తివారి మీద అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.