Thursday, December 05, 2019
Follow Us on :

తండ్రిని మించిన తనయుడు.. అలా ఐతే హగ్ కాకుండా ఏం కోరుకుంటాం?

By BhaaratToday | Published On Apr 13th, 2019

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే కేటీఆర్.. హాట్ హాట్ పొలిటికల్ వ్యాఖ్యలతో పాటు.. కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని షేర్ చేస్తుంటారు. తాజాగా అదే తరహాలో ఆయన తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా విపరీతమైన బిజీలో ఉంటూ వచ్చిన ఆయన గురువారం జరిగిన పోలింగ్ తో ఎన్నికల మారథాన్ కు బ్రేక్ పడినట్లైంది. 

పాలిటిక్స్ కు బ్రేక్ ఇచ్చిన ఆయన.. కుటుంబంతో రిలాక్స్ అయ్యారు. ఈ సందర్భంగా తన పదమూడేళ్ల కొడుకుతో ఆయన దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట హడావుడి చేస్తుంది. పదమూడేళ్ల వయసుకే మీ కుమారుడు ఎత్తులో మిమ్మల్ని మించిపోతే.. గట్టిగా ఓ హగ్‌ను కాకుండా ఇంకా ఏం కోరుకుంటారు.? ఇలానే ఉంటుంది అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. కొడుకు బిగి కౌగిలిలో తన్మయత్వంలో చిక్కుకుపోయిన కేటీఆర్ ఫోటో చూసినప్పుడు.. మారిన ఈ తరం నాన్న కనిపిస్తారు.