Thursday, September 19, 2019
Follow Us on :

సుష్మా స్వరాజ్ మరణంపై పాకిస్థానీ ట్వీట్.. ఘాటుగా రిప్లై ఇచ్చిన కేటీఆర్

By BhaaratToday | Published On Aug 7th, 2019

సుష్మా స్వరాజ్ మరణ వార్త బయటకు రావడంతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. పార్టీలకు అతీతంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఎందరో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. కానీ కొందరు పాకిస్థానీలు మాత్రం చాలా నీచంగా కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారిలో ఓ వ్యక్తికి కేటీఆర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. 

సుష్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేయగా ఓ పాకిస్థానీ నెటిజెన్ దారుణ వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే ఆమె చనిపోయారని... ఆమె కోసం నరకం ఎదురు చూస్తోందని ట్వీట్ చేశాడు. దీంతో కేటీఆర్ ఆ వ్యక్తిపై మండిపడ్డారు. సుష్మాస్వరాజ్ మరణంపై మీరు చేసిన వ్యాఖ్యలు మీ వక్ర బుద్ధికి ఈ కామెంట్ అద్దం పడుతోందని ఫైర్ అయ్యారు. మీ ప్రొఫైల్ పిక్ చూస్తుంటే... మీరు పాకిస్థాన్ కు చెందినవారిలా ఉన్నారని.. జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించడానికి మీరు కొంత ధైర్యాన్ని తెచ్చుకోవాలని ట్వీట్ చేశారు. 

సుష్మ స్వరాజ్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే ఆమెతో కలిసి తీసుకున్న ఫోటోలను కూడా కేటీఆర్ సోషల్ మీడియాలో పెట్టారు.