
మే 19న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు అనుభవజ్ఞులకే పట్టం కడతారని మాజీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్ రీత్యా అనుభవజ్ఞులైన నాయకుల అవసరం ఉందన్నారు. ఓటేసేముందు ప్రజలు అభివృద్ధి, సంక్షేమం రెండిటినీ చూస్తారని అన్నారు.