Monday, December 16, 2019
Follow Us on :

కేసీఆర్ పై అమిత్ షాకు ఫిర్యాదు చేసిన లక్ష్మణ్.. అమిత్ షా తెలంగాణ రాక ఎప్పుడంటే..?

By BhaaratToday | Published On Aug 10th, 2019

 తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ఫైర్ అయ్యారు. జాతకాలు, వాస్తుపై నమ్మకంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని లక్ష్మణ్ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ తన నమ్మకాలతో సచివాలయ భవనాలను కూల్చేస్తున్నారని తెలిపారు. జమ్ముకశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని, పార్టీకి తెలంగాణలో ఆదరణ పెరుగుతోందని చెప్పారు.

మాజీ ఎంపీ వివేక్ ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అమిత్ షాతో లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అమిత్ షా మాట్లాడుతూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న నిజామాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు అమిత్ షా హాజరు కానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ గత కొంతకాలంగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే నిజామాబాద్‌లో సభ నిర్వహించాలని నిర్ణయించింది. 

Image

Image