Thursday, April 25, 2019
Follow Us on :

బయోపిక్ సినిమాలపై ఈసీ కీలక నిర్ణయం

By BhaaratToday | Published On Apr 11th, 2019

ఎన్నికల సమయంలో బయోపిక్ సినిమాలపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేతల బయోపిక్‌లను థియేటర్లలో ప్రదర్శించొద్దని సూచించింది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రసారాలు చేయకూడదని ఆదేశించింది. బయోపిక్‌లపై ప్రకటనలు, వాల్ పోస్టర్లు కూడా ఉండొద్దని పేర్కొంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నంత వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టంచేసింది. బయోపిక్‌లపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిశీలించాక ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ ప్రజలను ప్రభావితం చేస్తాయంటూ ఇటీవల కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలపై ఫిర్యాదులు రావడం తెలిసిందే. ఇలాంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు అభ్యంతరం చెప్పింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఏపీలో బ్రేక్ పడినట్లు అయ్యింది. ఎన్నికలు పూర్తయ్యాకే ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రం విడుదల కూడా వాయిదా పడింది.