Thursday, December 05, 2019
Follow Us on :

నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నమ్మడమే.. దుమారం రేపుతున్న ట్రైలర్

By BhaaratToday | Published On Feb 14th, 2019

నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నమ్మడమే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రయిలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం 9.27 గంటలకు జీవీ ఫిల్మ్స్ ట్రైల‌ర్‌ విడుదల చేసింది. కృతజ్ఞతలేని కుటుంబాలు, విశ్వాసంలేని అనుచరులు, వెన్నుపోటు పొడిచే ద్రోహులతో కూడిన లవ్ స్టోరీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. అసలు సిసలైన కథ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ గతంలోనే ఆర్జీవీ కామెంట్ చేశారు. 

'స్వామీ... మీతో ఫోన్ లో మాట్లాడిన లక్ష్మీ పార్వతిని నేనే' అనే డైలాగ్ తో క్యారెక్టర్ ను పరిచయం చేశారు. తన కుమారులై ఉండి వాడితో చేరారా సిగ్గులేకుండా అని ఎన్టీఆర్ అనడం, లక్ష్మీపార్వతి మెడలో తాళి కట్టడం, వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ పై చెప్పులు విసిరిన పలు సంఘటనలు ఈ టీజర్ లో ఉన్నాయి. వారి కుటుంబం మధ్య ఎన్నో సంఘటనలు.. నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నమ్మడమే.. అంటూ ఎన్టీఆర్ చెప్పడం.. 'దగా' అంటూ ట్రైలర్ ముగించాడు. మీరూ చూడండి ట్రైలర్..