Friday, July 19, 2019
Follow Us on :

ఏపీలో విడుద‌ల‌పై సుప్రీంకోర్టుకు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నిర్మాత‌

By BhaaratToday | Published On Apr 1st, 2019

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను నిలిపివేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి సోమ‌వారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.