Sunday, August 25, 2019
Follow Us on :

44 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారి.. అందుకే ఈ లేఖ!

By BhaaratToday | Published On Apr 10th, 2019

దాణా కుంభకోణం కేసులో శిక్షను అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు నేడు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లాలూకు బెయిల్ ఇవ్వద్దంటూ సుప్రీంలో సీబీఐ రివ్యూ పిటిషన్ వేసింది. గత ఎనిమిది నెలలుగా ఆసుపత్రి వార్డులోనే ఉన్నప్పటికీ.. అక్కడి నుంచే రాజకీయాల్లో లాలూ చురుకుగా పొల్గొంటున్నారని సీబీఐ పేర్కొన్న నేపథ్యంలో.. లాలూకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.  

దీంతో రాష్ట్రంలోని ఓటర్లకు లాలూ ప్రసాద్ ఓ బహిరంగ లేఖ రాశారు. 44 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనకుండా జరుగుతున్న తొలి ఎన్నిక ఇదేనని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల పండుగలో ప్రజలను దర్శించుకునే అవకాశం లేకుండా చేశారని బాధను వ్యక్తం చేశారు. అందుకే జైలు నుంచే మీకు లేఖను రాస్తున్నానని చెప్పారు. లేఖను అర్థం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యంగ విలువలను కాపాడుతారని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.