Wednesday, October 16, 2019
Follow Us on :

ప్రతి ఏడాది ఆయన ఇంట్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఈసారి మాత్రం..!

By BhaaratToday | Published On Aug 15th, 2019

ప్రతి ఏడాదీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆయన ఇంట్లో ఘనంగా జరుపుకునే వారు. పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యేవారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆయన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. అందుకు కారణం ఆయన అనారోగ్యానికి గురవ్వడమే. గత అయిదు రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. 

91 ఏళ్ల అద్వానీ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఆ కారణం చేతనే స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రతి ఏడాది ఆయన నివాసంలో ఆగస్టు 15న సందడి వాతావరణం ఉండేది. కానీ ఈసారి అద్వానీకి వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఈసారి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం లేదు.