Friday, December 06, 2019
Follow Us on :

ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

By BhaaratToday | Published On Mar 18th, 2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సోమ‌వారం విడుదల చేశారు. 25 లోక్‌ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువరించామని ద్వివేది తెలిపారు. వెంటనే జిల్లావారీగా నోటిఫికేషన్‌ లు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. నామినేషన్‌ లను స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. కాగా, ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, మిగతా పార్టీలు వెనకున్నాయి. తెలుగుదేశం పార్టీ 35 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ఇంకా నిర్ణయించలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కరి పేరును కూడా ప్రకటించలేదు. కాగా, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వచ్చేనెల 11న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నోటిఫికేషన్ విడుదలైంది.