Friday, July 19, 2019
Follow Us on :

ఆయ‌న‌ ఫ్యాన్ తిర‌గ‌దు.. జ‌గ‌న్ పై లోకేష్ సెటైర్లు

By BhaaratToday | Published On Mar 31st, 2019

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పై సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇలాగే అమలుకావాలంటే మళ్లీ తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న లోకేష్.. జగన్‌ను చూస్తే జాలి వేస్తోందన్నారు. ఆయన చేతిలో ఓ ఫ్యాన్‌ పట్టుకొని తిరుగుతున్నారని.. కానీ ఆ ఫ్యాన్‌ తిరగదని ఎద్దేవా చేశారు. ఆ ఫ్యాన్‌ స్విచ్‌ ప్రధాని మోదీ వద్ద, రెగ్యులేటర్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ వద్ద ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కియా పరిశ్రమను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చారన్న జగన్‌ వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్‌ తిప్పికొట్టారు. చంద్రబాబు కృషి ఫలితంగానే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటైందని స్పష్టంచేశారు. కియా మోటార్స్‌ విషయంలో ప్రతిపక్ష నేత అన్యాయంగా మాట్లాడారని మండిపడ్డారు.