Thursday, September 19, 2019
Follow Us on :

చిదంబరానికి మరిన్ని చిక్కులు..!

By BhaaratToday | Published On Aug 21st, 2019

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి చిదంబరం మరింత చిక్కుల్లో పడ్డాడు. అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ, ఈడీ అధికారులకు నిరాశే ఎదురైంది. చిదంబరం తన నివాసంలో లేకపోగా, ఆయన ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే చిదంబరం అదృశ్యమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే చిదంబరం దేశం విడిచిపారిపోకుండా ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులు జారీచేస్తే సంబంధిత వ్యక్తులు విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టుల్లో అడ్డుకుంటారు. 

2007లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూప్ కు రూ.305 కోట్లు విదేశీ నిధుల రూపంలో వచ్చాయి. దీనికి అనుమతులు ఇచ్చింది చిదంబరం పేషీనే కావడంతో ఆయనపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తదనంతర కాలంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.