Sunday, August 25, 2019
Follow Us on :

ఈరోజు సాయంత్రం నుండి శ్రీవారి ఆలయం మూసివేత

By BhaaratToday | Published On Jul 16th, 2019

మంగళవారం సాయంత్రం ఏడు గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. నేటి అర్ధరాత్రి దాటాక (బుధవారం వేకువజామున) 1:31 నుంచి 4:29 గంటల వరకు చంద్రగ్రహణం ఉండడంతో ఆలయాన్ని మూసివేయాలని అర్చకులు నిర్ణయం తీసుకున్నారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేయనున్నామని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం ఆణివార ఆస్థానం పూర్తిచేసి 11 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తారు. అలాగే చంద్రగ్రహణం కారణంగా తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి  ఆలయాలు కూడా మూసివేయనున్నారు.