Wednesday, October 16, 2019
Follow Us on :

నెక్స్ట్ చనిపోయేది మోదీ అంటూ బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

By BhaaratToday | Published On Aug 28th, 2019

భారతీయ జనతాపార్టీకి చెందిన సీనియర్ నేతలు మరణిస్తూ ఉండడంతో ఆ పార్టీ నాయకులు ఎంతో బాధలో ఉన్నారు. కార్యకర్తలు కూడా తమ అభిమాన నాయకులను కోల్పోయామన్న బాధల్లో ఉండగా బ్రిటన్ ఎంపీ నజీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నెక్ట్స్ చనిపోతారంటూ ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ట్వీట్ చేశారు. 

నజీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలపై భారత నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బీజేపీ నేతలపై భారత్ లోని ప్రతిపక్ష పార్టీ చేతబడులు చేయిస్తోందని.. ఈ కారణం వల్లే ఇప్పటికే బీజేపీ కీలక నేతలైన అటల్ బిహారీ వాజ్ పేయి, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు మరణించారని... తర్వాతి వంతు మోదీదేనని అని ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్ పై పలువురు ప్రముఖులు నెటిజన్లు మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యక్తులు చట్ట సభల్లోకి ఎలా వస్తారో అంటూ మండిపడ్డారు. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఇటీవల బీజేపీ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేతబడి చేయిస్తున్నాయని సాధ్వీ ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తనకు మహరాజ్ జీ అనే ఆధ్మాత్మికవేత్త చెప్పారని సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చెప్పారు. బీజేపీపై ప్రత్యర్థులు క్షుద్రపూజలు చేయిస్తున్నారని మహరాజ్ జీ చెప్పింది నిజమే అనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు బీజేపీకి దుర్దశ నడుస్తోందన్న భావన కలుగుతోందని ఆమె అన్నారు. 
Image result for britain mp nazir ahmed