Sunday, August 18, 2019
Follow Us on :

1870, జూలై 12 తరువాత ఈరోజే అలా జరగడం..!

By BhaaratToday | Published On Jul 16th, 2019

నేడు గురు పౌర్ణమి.. అలాగే చంద్ర గ్రహణం కూడా.. ఇలా గతంలో 1870, జూలై 12న ఏర్పడిందట..!  అంటే దాదాపు 150 సంవత్సరాలు. మొత్తం 178 నిమిషాల పాటు ఉండే గ్రహణం మన దేశంలో పాక్షికంగా కనిపిస్తుంది.  గ్రహణం నేటి రాత్రి ఉత్తరాషాఢ నక్షత్రం తొలిపాదంలో అంటే అర్ధరాత్రి 1.30 గంటలకు ధనస్సు రాశిలో ప్రారంభమై, అదే నక్షత్రం రెండో పాదంలో, తెల్లవారుజామున 4.31 నిమిషాలకు మకర రాశిలో ముగుస్తుంది.  రాహువు, శని, చంద్రుడితో కలిసి ధనస్సు రాశిలో ఉన్న సమయంలో గ్రహణం వస్తున్నందున ఆయా రాశులు, నక్షత్రాలను బట్టి, అధమ, మధ్యమ, విశేష ఫలితాలు కలగనున్నాయట. వృషభ, మిథున, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి అధమ ఫలితాలను, తుల, కుంభ రాశుల వారికి మధ్యమ ఫలితాలు, మేష, కర్కాటక, వృశ్చిక, సింహ, మీన రాశుల వారికి విశేష ఫలం ఉండనుంది. ఈ గ్రహణాన్ని పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినవారు, ధనుస్సు, మకర రాశులకు చెందిన వారు చూడవద్దని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.