Friday, July 19, 2019
Follow Us on :

ఐపీఎల్ ముందే చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్

By BhaaratToday | Published On Mar 20th, 2019

ఐపీఎల్ లో రెండేళ్ల నిషేధం అనంతరం ఎంట్రీ ఇచ్చి గత సీజన్ లో ట్రోఫీని కైవసం చేసుకుంది. సీజన్ ఏదైనా సూపర్ కింగ్స్ మాత్రం ప్లే ఆఫ్స్ కు చేరుకుంటారు. ధోనీ కెప్టెన్సీలో అద్భుతమైన విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో కూడా గొప్ప ప్రదర్శన ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టుకు కీలకమైన బౌలర్లలో సౌత్ ఆఫ్రికా లేటెస్ట్ సెన్సేషన్ 'లుంగి ఎంగిడి' కూడా ఒకరు. భారత్ మీద సిరీస్ లో కూడా లుంగి ఎంగిడి అద్భుతమైన ప్రదర్శన చేశాడు.. ఈ ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగుతాడని అందరూ భావించారు.

అయితే గాయం కారణంగా అతడు దూరం అవ్వనున్నాడు. శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో గాయపడ్డాడు.. ఎడమవైపు పక్కటెముకలు దగ్గర విపరీతమైన నొప్పి వస్తున్న కారణంతో లుంగి ఎంగిడి ఐపీఎల్ కు దూరం కాబోతున్నాడు. అతడికి విశ్రాంతి కావాలని ఆ దేశ బోర్డు సూచించింది. అయితే లుంగి ఎంగిడి అసలు ఈ సీజన్ ఆడుతాడా.. లేక వరల్డ్ కప్ కోసం రెస్ట్ తీసుకుంటాడా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 23 నుండి మొదలు కాబోతోంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.