Wednesday, October 16, 2019
Follow Us on :

7 గంటల్లో 4 ఆపరేషన్లు..! 48 గంటల్లో 28 యూనిట్ల రక్తం..!!

By BhaaratToday | Published On Feb 8th, 2019

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్ధిని కోలుకుంటోంది. ఈ విషయాన్ని యశోదా ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. 48 గంటల వైద్యుల శ్రమ ఫలితానికి విద్యార్ధినీ ఆరోగ్యం మెరుగు పడిందని యశోద హాస్పిటల్ సీఓఓ విజయ్ కుమార్ తెలిపారు. సుమారు ఏడు గంటల పాటు ఐదుగురు సభ్యుల వైద్య బృందం నాలుగు సర్జరీలు చేశారని, సర్జరీల తర్వాత విద్యార్ధిని పూర్తిగా కోలుకుందని చెప్పారు. డాక్టర్లు అడిగినదానికి సైగలు చేస్తోందన్నారు. బ్రెయిన్‌పై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశామని, ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదట పడిందని విజయ్ వెల్లడించారు. మరో 48 గంటల పాటు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని, ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందన్నారు. ఆమెకు ఇప్పటి వరకు 28 యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని చెప్పారు. నాలుగు సర్జరీలు చేశారు కాబట్టి ఆమె పూర్తిగా కోలుకోడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. విద్యార్ధినీ ఇంకా వెంటిలేటర్‌పైనే ఉందని, శనివారం మధ్యాహ్నం వరకు ఆమెను వెంటిలేటర్‌పైనే ఉంచనున్నట్లు యశోద హాస్పిటల్ సీఓఓ విజయ్‌ కుమార్ తెలిపారు.