Friday, July 19, 2019
Follow Us on :

దేశ భ‌క్తుడిగా మ‌హేష్‌బాబు

By BhaaratToday | Published On Mar 20th, 2019

మహేశ్ బాబు ...వంశీ పైడిపల్లి కాంబినేషన్లో 'మహర్షి' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ముగింపు ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు ఎలా కనిపించనున్నాడు? అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు దేశభక్తుడిగా కనిపించనున్నాడనే వార్త‌ ఫిల్మ్ నగర్‌లో వైర‌ల్ అవుతోంది. మిలటరీ అధికారిగా పనిచేసే హీరో .. సెలవులకి తన ఊరికి వచ్చిన దగ్గర నుంచి కథ మొదలవుతుందని అంటున్నారు. అనిల్ రావిపూడి తరహా వినోదంతో పాటు, దేశభక్తి పాళ్లు కూడా ఉంటాయని స‌మాచారం. ఒక వైపున రాజమౌళి సినిమాలో  చరణ్ .. ఎన్టీఆర్ దేశభక్తులుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, మహేశ్ బాబు కూడా దేశభక్తుడిగానే క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.