Wednesday, October 16, 2019
Follow Us on :

సంవత్సరం టైమ్.. ఈలోగా సచిన్ అవుతావో.. సోంబేరి అవుతావో నీ ఇష్టం..!

By BhaaratToday | Published On Feb 14th, 2019

'నీకో సంవత్సరం టైమ్ ఇస్తున్నాను.. ఈలోగా సచిన్ అవుతావో.. సోంబేరి అవుతావో నీ ఇష్టం'.. 'ఒకసారి పోతే మళ్ళీ తిరిగిరాదురా.. అది వస్తువైనా.. మనిషైనా'.. టీజర్ లో ఉన్న ఈ రెండు డైలాగ్ లు చాలు 'మజిలీ' సినిమా ఎలా ఉంటుందో..! 

నాగ చైతన్య హీరోగా.. సమంత, దివ్యాన్ష కౌషిక్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'మజిలీ' చిత్రం టీజర్ విడుదలైంది. టీనేజ్ లవ్ స్టోరీ.. పెళ్ళైన తర్వాత పెళ్ళాంతో అనుబంధం ఈ చిత్రంలో ఉండనున్నాయి. భర్త ఎలా ప్రవర్తించినా వెనకేసుకొచ్చే భార్యగా సమంత ఇందులో కనిపిస్తుంది. 'నిన్ను కోరి' తర్వాత శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్‌ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గోపీసుందర్‌ సంగీతం అందిస్తుండగా విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పై సాహు గరపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌5న విడుదల కానుంది.