Thursday, September 19, 2019
Follow Us on :

1100 కోట్ల రూపాయల భారీ డ్రగ్స్ రాకెట్ పట్టివేత.. ఇందులో కూడా పాకిస్థాన్ పేరు

By BhaaratToday | Published On Aug 23rd, 2019

మలేషియా అధికారులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం సంచలమైంది. 1100 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను శుక్రవారం నాడు మలేషియా అధికారులు పట్టుకున్నారు. ఆ దేశ చరిత్రలోనే ఇదే భారీ డ్రగ్స్ రాకెట్ అని అంటున్నారు. అమెరికన్ కరెన్సీలో 161 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. 3.7 టన్నుల కెటామైన్, కొకెయిన్ ను పట్టుకొన్నారు.  

కౌలాలంపూర్ పరిసరాల్లో ఉన్న పుంచక్ ఆలంలో ఉన్న ఓ గోడౌన్ లో ఏకంగా 467 కేజీల కెటామైన్ ను ఆగస్టు 18న జరిగిన రైడ్ లో పట్టుకున్నారు. ఆ తర్వాత విచారణ చేయగా ఏకంగా 3200 కేజీల కొకెయిన్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో వారు చెప్పిన ప్రాంతాల్లో సోదాలు చేయగా 3.7 టన్నుల కెటామైన్, కొకెయిన్ దొరికిపోయింది. కెటామైన్ పాకిస్థాన్ నుండి మలేషియాకు వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. కొకెయిన్ ను ఈక్వడార్ నుండి తీసుకొచ్చారని   కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ హలీమ్ బయటపెట్టారు. మలేషియా నుండి ఇతరదేశాలకు తరలించే సమయంలో పట్టేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం నలుగురు మలేషియన్స్ నూ.. తొమ్మిది మంది ఫారెనర్స్ నూ పోలీసులు అరెస్ట్ చేశారు.  మలేషియా దేశ నార్కోటిక్స్ చరిత్రలోనే అత్యంత విలువైనది ఇదేనట..!