Friday, July 19, 2019
Follow Us on :

మ‌మ‌తాకు షాకిచ్చిన సుప్రీం కోర్టు

By BhaaratToday | Published On May 15th, 2019

- ప్ర‌యాంక శ‌ర్మ అరెస్టు ఏక‌ప‌క్ష‌న్న కోర్టు
- ప్ర‌యాంక శ‌ర్మ‌ను విడుద‌ల చేయ‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు

 సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీ ఫోటోను మార్ఫింగ్‌ చేసిన కేసులో సుప్రీంకోర్టు తీవ్రంగా మండిప‌డింది. బీజేవైఎం కార్యకర్త ప్రియాంక వర్మను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందన్న కోర్టు మమత సర్కారును హెచ్చరించింది. ప్రియాంక శర్మ అరెస్టు ఏకపక్షమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే విడుదల చేయకపోతే క‌ఠిన చ‌ర్య‌లు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

అయితే ప్రియాంక శర్మను విడుదల చేయాలని నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా సర్కార్‌ బేఖాతరు చేసింది. దీంతో ప్రియాంక బంధువులు మమతా బెనర్జీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా మమతపై అ‍భ్యంతరకర పోస్ట్‌ను ఫార్వర్డ్‌ చేసినందుకు ప్రియాంశ శర్మ బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఆమెను విడుదల చేస్తామని పశ్చిమ బెంగాల్‌ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఆమెను ఈ రోజు 9.40కి విడుదల చేసినట్లు ప్రభుత్వతరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ప్రియాంకా శర్మను తక్షణమే ఎందుకు విడుదల చేయలేదని న్యాయస్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.