Saturday, October 19, 2019
Follow Us on :

కారులో కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్న వ్యక్తి.. విషయం ఏమిటంటే..!

By BhaaratToday | Published On Sep 9th, 2019

కారులో సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఫైన్ వేస్తారని తెలిసిందే.. అయితే అలీగఢ్ కు చెందిన ఓ వ్యక్తికి మాత్రం హెల్మెట్ ధరించలేదని ఛలాన్ విధించారు. దీంతో అతడు కారులో వెళ్లే సమయంలో కూడా హెల్మెట్ పెట్టుకొని తన నిరసన తెలియజేశాడు. దీంతో అతడి గురించి పలు వార్తా పత్రికల్లో ప్రచురించారు. పియూష్ వార్షే కు హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమని చెప్పారు ట్రాఫిక్ పోలీసులు.. ఆగష్టు 27న 500 ఫైన్ పడుతూ కట్టమంటూ చలాన్ పంపించారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరుపై నిరసన తెలియజేయాలని ఇలా అతడు హెల్మెట్ పెట్టుకొని కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఎందుకు ఇలా అని అడగ్గా ట్రాఫిక్ పోలీసులు పంపించిన ఛలాన్ గురించి అందరికీ వివరిస్తూ ఉన్నాడు. ఆ కారు తన తండ్రిదని.. ఆయన కారును నడిపే స్థితిలో ఆయన లేరని అందుకే తాను ఇలా హెల్మెట్ కారులో పెట్టుకొన్నానని చెప్పుకొచ్చాడు. 

దీనిపై స్థానిక పోలీసులు స్పందించారు. ఛలాన్ లను విధించే సమయంలో పలుమార్లు తప్పులు దొర్లుతున్నాయని.. వీటన్నిటినీ వెరిఫై చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఒకవేళ అనవసరంగా ఏ వాహనంపైన అయినా ఛలాన్ విధించి ఉంటే వాటిని వెరిఫై చేసి కాన్సల్ చేస్తామని హామీ ఇచ్చారు.