Monday, November 18, 2019
Follow Us on :

సినిమా వాళ్ళు కేసీఆర్ కు భయపడడం లేదన్న మంచు విష్ణు

By BhaaratToday | Published On Apr 26th, 2019

తెలంగాణ ఇంటర్ బోర్డు చేసిన తప్పులకు  20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై మాట్లాడడానికి సినిమా వాళ్లు భయపడుతున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ తప్పిదాల వెనక ఉన్న కారణాలను తెలుసుకుంటే భవిష్యత్తులో మరిన్ని తప్పిదాలు జరగకుండా అడ్డుకోవచ్చని విష్ణు తన ట్వీట్లలో చెప్పుకొచ్చాడు.  

సినిమా వాళ్లు కేసీఆర్‌కు భయపడుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని.. ఈ ఘటనలో 20 మంది తమ్ముళ్లు, చెల్లెళ్లను కోల్పోవడం దురదృష్టకరమన్నారు విష్ణు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలపై ప్రభుత్వం స్పందించి ఉండకపోతే అప్పుడు నిజంగానే విమర్శలు వెల్లువెత్తేవని.. వారిపై కేసీఆర్ చర్యలు తీసుకుంటారని విష్ణు అన్నారు. కేసీఆర్ డిక్టేటర్ కాదని, ఫైర్‌బ్రాండ్ అనేది అందరికీ తెలిసిన విషయమేనని.. విషయాలన్నీ అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని నిందించడం మాని దీని వెనక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవాలని విష్ణు చెప్పుకొచ్చారు.  కేసీఆర్‌ను చూసి సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు భయపడుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.