Wednesday, October 16, 2019
Follow Us on :

మావోయిస్టు దంప‌తులు అరెస్టు...వీరిపై గ‌తంలో రూ.20 ల‌క్ష‌ల రివార్డు

By BhaaratToday | Published On Jun 12th, 2019

ప్రముఖ మావోయిస్టులు కిరణ్, ఆయన భార్య నర్మదను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో వీళ్లిద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై గతంలో రూ.20 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. కిరణ్ దంపతుల స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ. గత నెలలో మహారాష్ట్రలో జరిగిన పేలుళ్ల వెనుక కిరణ్ హస్తం ఉన్నట్టు పోలీసుల సమాచారం. అయితే అప్ప‌ట్లో పోలీసులు వీరి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.