Friday, December 13, 2019
Follow Us on :

భద్రాద్రిలో మావోల ఘాతుకం.. మాజీ ఎంపీటీసీ దారుణ‌హ‌త్య‌

By BhaaratToday | Published On Jul 12th, 2019

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ నేత శ్రీనివాసరావును మావోయిస్టులు దారుణంగా హత్యచేశారు. ఈ నెల 8వ తేదీన మావోలు శ్రీనివాసరావును కిడ్నాప్ చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందునే శ్రీనివాసరావును హత్యచేసినట్టు మావోయిస్టులు పేర్కొన్నారు. ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది. శ్రీనివాసరావు మృతదేహం వద్ద చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో లేఖ దొరికింది. ఆదివాసీ ప్రజాసంఘాల పేరుతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇక, 8వ తేదీన కిడ్నాప్‌నకు గురైన శ్రీనివాసరావు ఆచూకీ తెలుసుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పట్టారు. ఈ నేఫ‌థ్యంలో నేడు శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది.