Monday, November 18, 2019
Follow Us on :

అభిమాని కుటుంబాన్ని ఇంటికి పిలిపించిన మెగాస్టార్.. ఎందుకో తెలుసా..?

By BhaaratToday | Published On Apr 22nd, 2019

తాము ఆరాధించే హీరోల విషయంలో కొందరు అభిమానులకు ఎంత పట్టింపులు ఉంటాయో గతంలో చాలా సంఘటనల విషయంలో స్పష్టమవుతుంది. అమితాబ్ ను కలవకపోతే పెళ్లే చేసుకోను అని శపథం చేసిన అభిమానులు.. రజనీకాంత్ ను చూడనిదే ఇంటికి వెళ్ళ కూడదు అని అనుకున్న అభిమానులు.. తమ ఫేవరెట్ హీరోలను జీవితంలో ఒక్కసారైనా కలవాలి అని అనుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటి అభిమానులు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉన్నారు. అతడి అభిమానం గురించి తెలుసుకున్న చిరంజీవి ఏకంగా తన ఇంటికే పిలిపించారు.     


తూర్పుగోదావరి జిల్లా మందపల్లి గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు చిరంజీవికి వీరాభిమాని. గతేడాది ఆయనకు ఓ కొడుకు పుట్టాడు. బిడ్డకు నామకరణం చేయించలేదు.. ఎందుకో తెలుసా..? తన బిడ్డకు మెగాస్టారే స్వయంగా నామకరణం చేయాలని.. లేకపోతే పేరు పెట్టనని వెంకటేశ్వరరావు మొండి పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ విషయాన్ని చిరంజీవికి చేరిపోయింది. నక్కా వెంకటేశ్వరరావును భార్యాబిడ్డలతో సహా తన ఇంటికి పిలిపించారు. భార్య, ముగ్గురు పిల్లలతో వచ్చిన వెంకటేశ్వర్ రావును చిరంజీవి ఆత్మీయంగా ఇంటిలోకి పిలుచుకొని వెళ్లారు.  అతడి కొడుక్కు  'పవన్ శంకర్' అనే పేరు పెట్టారు. ఆ అభిమాని కుటుంబంతో చిరంజీవి దాదాపు గంటసేపు ముచ్చటించారు.

గతంలో కూడా నక్కా వెంకటేశ్వరరావు గురించి వార్తల్లో వచ్చిన సంగతి తెలిసిందే. నక్కా వెంకటేశ్వరరావు ప్రజారాజ్యం పార్టీలో చేరాడన్న కారణంతో వెంకటేశ్వరరావును ఐదేళ్లపాటు గ్రామం నుంచి వెలివేశారు. అప్పట్లో ఈ విషయం తెలిసిన చిరంజీవి వెంకటేశ్వరరావును ఇంటికి పిలిచి ఒక రోజంతా ఆశ్రయం ఇచ్చారు.