Sunday, August 25, 2019
Follow Us on :

రాజంపేట వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి ఘ‌న‌విజ‌యం

By BhaaratToday | Published On May 23rd, 2019

కడప జిల్లా రాజంపేట లోక్‌సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో మిథున్‌రెడ్డి గెలుపొందారు. 2014లో కూడా మిథున్‌రెడ్డి లక్షా 74 వేల మెజార్టీతో గెలిచారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన అన్ని రౌండ్ల లెక్కింపులో 25 లోక్ స‌భ స్థానాల‌లో వైసీపీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతుంది. అధికార తెలుగుదేశం పార్టీ ఏ ద‌శ‌లో పోటీనివ్వ‌లేని ప‌రిస్థితిలో ఉంది.