Wednesday, October 16, 2019
Follow Us on :

హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ తప్పు చేశారు..!

By BhaaratToday | Published On Jan 14th, 2019

క్రికెటర్లకు మన దేశంలో ఎంత ప్రాధాన్యతను ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పని చేసినా పెద్ద పబ్లిసిటీ.. అదే ఏదైనా తప్పు జరిగితే ఎఫెక్ట్ కూడా అదే రేంజిలో ఉంటది. మీడియా, ప్రజలు కడిగిపడేస్తారు. ఇప్పుడు భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు.

ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రామ్ లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వీరిరువురూ. బీసీసీఐ వాళ్లపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఇద్దరికీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఈ ఇద్దరు క్రికెటర్లు తమకు యువతులతో ఉన్న సంబంధాలను పబ్లిగ్గా చెప్పడం వివాదానికి దారి తీసింది. హార్దిక్ పాండ్యా ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పేశాడు. ఇకపై మన క్రికెటర్లు ఇలాంటి షోలలో పాల్గొనాలా వద్దా అన్నది పరిశీలించబోతోంది బీసీసీఐ.