Thursday, April 25, 2019
Follow Us on :

2014లో అనుసరించిన సంప్రదాయాన్నే కొనసాగించనున్న మోదీ..!

By BhaaratToday | Published On Apr 15th, 2019

2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సాధించిన ఘన విజయం ఏ ఒక్కరూ మరచిపోరు. 2019లో కూడా అదే హవా కొనసాగించాలని మోదీ భావిస్తున్నారు. అయితే 2014లో అనుసరించిన సంప్రదాయాన్నే మోదీ కొనసాగించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నెల 26న నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2014లో మోదీ నామినేషన్ వేయడానికి ముందు, గెలిచిన తరువాత ఆ నియోజకవర్గంలో మోదీ ర్యాలీలు నిర్వహించారు. 2019లో జరగబోయే ఎన్నికల్లో కూడా మోదీ అదే విధంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న మోదీ వారణాసికి చేరుకుంటారని తెలుస్తోంది. ఆ రోజున భారీ ర్యాలీ నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ అన్ని ఏర్పాట్లను మొదలుపెట్టనుంది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి దశశ్వమేథ్ ఘాట్ వరకూ ఈ ర్యాలీ కొనసాగనుంది. కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుని, గంగా హారతి కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. నామినేషన్ వేసే రోజు ఉదయం కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకుని, మీడియా సమావేశంలో మాట్లాడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.