Saturday, October 19, 2019
Follow Us on :

తనకు దిష్టి తీసిన వాళ్లకు మోడీ ధన్యవాదాలు

By BhaaratToday | Published On Feb 10th, 2019

 గుంటూరులో పర్యటించిన ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏపీకి స్టేటస్ కంటే ఎక్కువ నిధులే ఇచ్చామని మోడీ వివరించారు. అయినా కూడా చంద్రబాబు విపక్షాలతో చేతులు కలిపి కేంద్రంపై నిందులు వేస్తున్నారని మండిపడ్డారు. తన ఏపీ పర్యటనకు వ్యతిరేకంగా నల్లబెలూన్లు ఎగరవేసిన వాళ్లకు మోడీ ధన్యవాదాలు చెప్పారు. ఏదైనా శుభకార్యం చేసే ముందు దిష్టి తీసినట్లుగా తన పర్యటనకు ముందు నల్లబెలూన్లు ఎగరవేసిన తన పర్యటనకు దిష్టి తీశారని చెప్పుకొచ్చారు. అలా దిష్టి వారికి ప్రధాని ధన్యవాదాలు తెలిపి.. వారి నిరసనను తిప్పికొట్టారు.