Sunday, August 18, 2019
Follow Us on :

అంబేద్కర్ రాజ్యాంగం వల్లే టీ అమ్ముకునే వ్యక్తి నేడు ప్రధాని అయ్యాడు!

By BhaaratToday | Published On Apr 14th, 2019

బాబా సాహెబ్ అంబేద్కర్ మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆ రాజ్యాంగం ఇచ్చిన బలం వల్లే తనవంటివారు ప్రధాన మంత్రి కాగలిగారని చెప్పారు. అలీగఢ్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘భారత రత్న’ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఘనత కారణంగానే అణగారిన, దోపిడీకి గురైన వర్గం నుంచి వచ్చిన  రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి కాగలిగారని.. మన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ రైతు కుటుంబానికి చెందినవారని గుర్తుచేశారు. బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగం వల్లే ఓ టీ అమ్ముకునే వ్యక్తి నేడు ప్రధాన మంత్రి పదవిని నిర్వహిస్తున్నాడని మోదీ ప్రశంసించారు. ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆర్ఎల్‌డీ కూటమిపై విరుచుకుపడుతూ లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాల నుంచి పోటీ చేయలేనివారు ప్రధాన మంత్రిని ఇవ్వగలరా? అని ప్రశ్నించారు.