Friday, March 22, 2019
Follow Us on :

‘మోదీ’ వెబ్‌సీరీస్ సిద్ధం.. విడుద‌ల ఎప్పుడంటే..?

By BhaaratToday | Published On Mar 14th, 2019

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్‌సీరీస్‌ను ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఓ ప్రకటనలో తెలిపారు. పది భాగాలుగా తీసిన ఈ సీరీస్‌ పేరును ‘మోదీ’ అని నిర్ణయించారు. ఈ వెబ్‌సీరీస్‌లో నరేంద్రమోదీ బాల్యానికి సంబంధించిన విశేషాలతో పాటు ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేంత వరకు అంచలంచెలుగా ఎదిగిన తీరును చిత్రీకరించినట్లు తెలిపారు. సిద్ధ్‌పూర్, వాద్‌నగర్, గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సీరీస్‌ను తీశామని వివరించారు. దీనికి సంబంధించిన మొదటి పోస్టర్‌ను సామాజిక మాద్యమంలో విడుదల చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ‘మోదీ’ వెబ్ సీరీస్‌కు ‘ఓ మై గాడ్’ ఫెమ్ ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించగా... మిహిర్ భుట్ట, రాధికా ఆనంద్ రచించారు. అయితే సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చే నెలలోనే ప్రారంభమవుతుండటం విశేషం.