Tuesday, May 21, 2019
Follow Us on :

ఫసక్ కాదు.. ఫినిష్ అన్న మోహన్ బాబు.. ఎవరంటే..!

By BhaaratToday | Published On Mar 31st, 2019

కొద్ది రోజుల క్రితం సినీ నటుడు మోహన్ బాబు అన్న 'ఫసక్' అనే పదం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన రాజకీయనాయకుడు. ఇటీవలే వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. ఫినిష్ చంద్రబాబు పార్టీ అంటూ ఎన్నికల్లో జరగబోయేది వివరించారు మోహన్ బాబు. అన్న ఎన్టీఆర్ కుటుంబంలోని వారు అమాయకులని, అందుకే, చంద్రబాబు వారిని మోసం చేస్తున్నారని అన్నారు మోహన్ బాబు.  ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దోచేశారని, లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్న దొంగ అని విమర్శించారు.    
    

 విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇసుక, మట్టి.. ఇలా అన్నీ దోచేస్తారని టీడీపీ నేతలపై ఆయన ఆరోపించారు.‘ఫినిష్ చంద్రబాబు పార్టీ, నో మోర్ చంద్రబాబు పార్టీ’ అని వ్యాఖ్యానించారు. ‘తెలుగుదేశాన్ని నమ్ముకున్న సోదరులారా! మళ్లీ మీకు ఈ టర్మ్ లేదు’ అని అన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బాగా చేయకపోతే ఇంకో టర్మ్ లో ఆ పార్టీకి అవకాశమొచ్చినా చంద్రబాబుకు మాత్రం వద్దని సూచించారు.