Friday, July 19, 2019
Follow Us on :

మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష..?

By BhaaratToday | Published On Apr 2nd, 2019

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షను విధించింది. ఆయనకు రూ. 41.75 లక్షల జరిమానాను విధించింది. సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మోహన్ బాబుపై 2010లో ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు. కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న, ఏ2గా మోహన్ బాబు ఉన్నారు. ఇటీవలే మోహన్ బాబు వైసీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇటువంటి వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.