Saturday, October 19, 2019
Follow Us on :

చంద్ర‌బాబుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మోహ‌న్‌బాబు

By BhaaratToday | Published On Mar 2nd, 2019

ఏపీ ప్ర‌భుత్వంపై న‌టుడు మోహ‌న్‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 2014-15 నుంచి విద్యానికేతన్ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదని దుయ్యబట్టారు. ఈ రోజు ఆయ‌న తిరుమ‌తిలో మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటింటికీ తిరిగి.. అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారు? అంటూ మోహన్ బాబు ప్రశ్నించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిన కాదని, ఏ పార్టీ ప్రోత్సాహంతో తాను మాట్లాడటం లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్ర‌బాబు స‌ర్కార్ ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోలేక‌పోయింద‌న్నారు.