Monday, November 18, 2019
Follow Us on :

రామ మందిరం నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్

By BhaaratToday | Published On Nov 9th, 2019

ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఎన్నో ఏళ్ల వివాదానికి తెరపడింది అని అన్నారు. తమ ముందు ఉన్న ఒకే ఒక్క కార్యం మందిరం నిర్మించడం మాత్రమే తమ ముందు ఉన్న కర్తవ్యం అన్నారు. తీర్పు అన్నది ఎవరి విజయం కాదని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను తాము శిరసావహిస్తామని అన్నారు. దేశంలో హిందూ, ముస్లింలు భాగమని.. అందరూ భారతీయులని.. దేశాన్ని అందరూ ముందుకు తీసుకొని వెళ్లాలని ఆయన అన్నారు. 'హమ్ తో మందిర్ బనాయేంగే' అంటూ మోహన్ భాగవత్ తన ప్రెస్ మీట్ ను ముగించారు.