Sunday, December 15, 2019
Follow Us on :

డోర్ బెల్ పాడయ్యింది.. తలుపు తీసేందుకు ఇలా చేయండి!

By BhaaratToday | Published On Apr 12th, 2019

ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లోని మొరేనాలో ఒక ఆసక్తికర నినాదం వెలుగు చూసింది. ఇక్కడి రామ్‌నగర్ కాలనీలోని చాలా ఇళ్ల ముందు నోటీసులు అతికించివున్నాయి. దానిపై ‘డోర్ బెల్ పాడయ్యింది. తలుపులు తీసేందుకు దయచేసి ‘మోదీ, మోదీ’ అని అరవండి’ అని రాసివుంది. దీనిపై రామ్‌నగర్ కాలనీవాసులు మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఎవరైనా వచ్చి తమను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నామన్నారు. ఈ కాలనీలో వందకు మించి ఇళ్ల ముందు ఇటువంటి నోటీసులు అతికించారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న పనులకు మెచ్చుకోలుగా ఇటువంటి నినాదం వినిపిస్తున్నామని వారు తెలిపారు. ఈ ప్రకటన స్థానికులను అమితంగా ఆకట్టుకుంటోంది.