Thursday, December 12, 2019
Follow Us on :

ఆ లిస్టులో భారత్ ప్రపంచ చాంపియన్ కన్నా ముందు.. మరి పాక్ పరిస్థితి

By BhaaratToday | Published On Jul 15th, 2019

 వరల్డ్ కప్ లో భారత్ ఆటను అంత తీసి పారేయడానికి వీలు లేదు. ఎందుకంటే 9 మ్యాచ్ లలో 7 విజయాలు సాధించడం అంటే మాటలు కాదు. కేవలం ఒకే ఒక్క ఓటమిని భారత్ చవిచూసింది. ఇక కివీస్ తో గ్రూప్ స్టేజి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సెమీస్ లో భారత్ అనుకోకుండా ఓటమిని చవిచూడడం కోట్లాది మంది భారత్ అభిమానులకు మింగుడుపడలేదు. ఇక ఫైనల్ ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..! ఫైనల్ లో నెగ్గిన ఇంగ్లాండ్ కూడా భారత్ సాధించిన ఓ రికార్డును అందుకోలేకపోయింది. అదేమిటంటే ఈ వరల్డ్ కప్ లో అతి తక్కువ పరాజయాలు చవిచూడడం. ఆ విషయంలో మనవాళ్లే గ్రేట్..! లీగ్‌ దశలో ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సెమీస్ లో మరో ఓటమిని అందుకుంది భారత్.    

ఈ ప్రపంచకప్‌లో అతి తక్కువ పరాజయాలు చవిచూసిన జట్టు భారత్‌ మాత్రమే. భారత్ రెండు మ్యాచ్ లలో ఓడిపోగా.. ఇంగ్లండ్‌ ఈ వరల్డ్ కప్ లో మూడు పరాజయాలు చవిచూసింది. ఇంగ్లండ్‌ జట్టు ఎనిమిది విజయాలు సాధించగా.. మూడు ఓటములు చవిచూసింది. ఆస్ట్రేలియా ఏడు విజయాలు దక్కగా.. మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు చవిచూసింది. పాకిస్థాన్ ఐదు విజయాలు, మూడు పరాజయాలు సాధించి కనీసం సెమీస్ కూడా చేరలేకపోయింది.  శ్రీలంక మూడు విజయాలు, నాలుగు పరాజయాలు, దక్షిణాఫ్రికా మూడు విజయాలు, ఐదు పరాజయాలు, బంగ్లాదేశ్‌ మూడు విజయాలు, ఐదు పరాజయాలు.. వెస్టిండీస్‌ రెండు విజయాలు మాత్రమే సాధించగా.. ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌ ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయకపోవడం క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశపరిచింది. ఆఫ్ఘనిస్థాన్ కొన్ని మ్యాచులు గెలిచే అవకాశం ఉన్నా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక బంగ్లాదేశ్ పెద్ద పెద్ద జట్లను ఓడించడం.. ఒకానొక దశలో సెమీ ఫైనల్ రేసులో కూడా నిల్చింది.