Monday, September 23, 2019
Follow Us on :

సాయంత్రం 7 గంటలకు ధోని ప్రెస్ కాన్ఫరెన్స్.. రిటైర్మెంట్ మీదనే నా..?

By BhaaratToday | Published On Sep 12th, 2019

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ రిటైర్మెంట్ పై చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు ధోని ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని వార్త రాగానే ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

 ఇక ఈ రోజు విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. ధోని ఘనతను గుర్తు చేసుకుంటూ.. ఆ గేమ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. అదొక ప్రత్యేకమైనది. పరుగుల విషయంలో ఒక పరీక్ష పెట్టాడు. అది ఫిట్‌నెస్‌ టెస్టులా అనిపించిందంటూ కోహ్లి ట్వీట్ చేశాడు.

2016, టీ20 ప్రపంచకప్‌‌లో ఆస్ట్రేలియా‌తో జరిగిన మ్యాచ్ సందర్భం అది.. 161 పరుగుల ఛేదనలో 14 ఓవర్లు ముగిసే సమయానికి 94/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోనీ.. విరాట్ కోహ్లీతో కలిసి 67 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో హిట్టింగ్ అన్నదే లేకుండా సింగిల్స్, డబుల్స్‌తోనే భారత్‌ని విజయాన్ని అందుకుంది.