Tuesday, June 18, 2019
Follow Us on :

ధోనీ.. రిటైర్‌మెంట్ త‌ర్వాత ఏం చేస్తాడంటే..

By BhaaratToday | Published On May 21st, 2019

మ‌హేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరుకు భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. తన అద్భుతమైన ఆట‌తీరుతో, కెప్టెన్సీతో టీం ఇండియాను నెం.1 క్రికెట్ జట్టుగా తీర్చిదిద్దాడు. అంతేకాక.. ధోనీ కెప్టెన్సీలో భారత్ మూడు మేజ‌ర్ ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకుంది. అయితే 2016లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. అయితే గత కొంతకాలంగా ధోనీ ఫామ్ కారణంగా అతను క్రికెట్ నుంచి రిటైర్‌ అవ్వాలి అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 2019 క్రికెట్ వరల్డ్‌కప్ కోసం సిద్ధమవుతున్న ధోనీ.. ఈ మెగా టోర్నమెంట్ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వెలువ‌డుతున్నాయి.

Image result for ms dhoni painting
 

అయితే తాజాగా మ‌హీ.. ఓ వీడియో ద్వారా రిటైర్‌మెంట్ తర్వాత తాను ఏం చేస్తాడో అనే విషయాన్ని ధోనీ పరోక్షంగా చెప్పేశాడు. తనకు చిన్ననాటి నుంచి పెయింటింగ్ అంటే ఇష్టమని.. త్వరలో తాను ఆర్టిస్ట్ మారుతానని ధోనీ అన్నాడు. ‘‘మీ అందరికీ ఓ సీక్రెట్ చెప్పాలి. చిన్ననాటి నుంచి నాకు ఆర్టిస్ట్ కావాలని కోరిక. ఇప్పటికే చాలా క్రికెట్ ఆడాను. ఇక నేను నాకు ఇష్టమైన పని చేయాల్సిన సమయం వచ్చేసింది. మీకు నేను వేసిన కొన్ని పెయింటింగ్స్ చూపిస్తాను’’ అంటూ ధోనీ తాను వేసిన కొన్ని పెయింటింగ్స్‌ని ఓ వీడియోలో చూపించాడు. అయితే ఈ వీడియోలో ధోనీ కాస్త వెరైటీ హెయిర్‌స్టైల్‌లో కనిపిస్తున్నాడు. అలాగే, దేశ‌వ్యాప్తంగా ఉన్న పేయింట‌ర్స్, ఆర్టిస్టుల‌ను స‌ల‌హాలు, సూచ‌న‌లు కోరాడు.