Monday, September 23, 2019
Follow Us on :

ధోనిని ఎందుకు తీసుకోలేదో చెప్పిన ఎమ్మెస్కే ప్రసాద్

By BhaaratToday | Published On Aug 30th, 2019

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే టి20 సిరీస్ కు మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ కూడా చేశారు. దీనిపై సెలెక్టర్లు దిగిరాక తప్పలేదు.. ఎందుకు ధోనిని టీ20 సిరీస్ కు తీసుకోలేదో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. 

 ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ ధోనీ సెలెక్షన్ కు అందుబాటులో లేడని, ప్రస్తుతం ధోనీ అమెరికాలో ఉన్నాడని.. అందుకే ధోనీని టీమిండియాకు ఎంపిక చేయలేదని వివరించారు. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య వంటి ఆటగాళ్లను దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు ఎంపిక చేశామని ఎమ్మెస్కే తెలిపారు. 

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు ఖరారైంది. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించింది.
జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్ పాండే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్ చాహర్‌, నవదీప్‌ సైనీ.