Friday, March 22, 2019
Follow Us on :

కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్

By BhaaratToday | Published On Mar 14th, 2019

ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో అయిదుగురు మృతి చెందగా.. 34 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద స్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం బాగా బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు  అంతరాయం ఏర్పడింది.